ఏపీలో తారాస్థాయికి చేరిన కక్ష సాధింపు చర్యలు : కళా వెంకట్రావు

బుధవారం, 17 మార్చి 2021 (16:49 IST)
ప్రతిపక్షంపై కక్షసాధింపుతో పాటు ప్రజా రాజధాని అమరావతిని చంపే కుట్రలో భాగంగానే వారెంట్ లేకుండానే మాజీ మంత్రి నారాయణ నివాసంలో సీఐడీ సోదాల సోదాల పేరుతో రాజకీయ దుష్ప్రచార దాడి చేస్తున్నారని టీడీపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
జగన్ రెడ్డి రాక్షస, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. అమరావతి భూముల్లో ఎలాంటి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు తేల్చిచెప్పినా జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలు ఆగడం లేదు. దళితుల అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములు మాదిరిగా ప్యాకేజీ ఇవ్వడమే తప్పా? ఇడుపులపాయలో 700 ఎకరాల దళితుల అసైన్డ్ భూములను జగన్ రెడ్డి కుటుంబం ఆక్రమించింది. 
 
విశాఖలో 2500 ఎకరాల అసైన్ మెంట్ భూములు తీసుకున్న జగన్ రెడ్డి కూడా నేరం చేసినట్టేనా? అమరావతిలో అక్రమాలు జరిగాయంటూ మంత్రి వర్గ ఉపసంఘం, అధికారుల కమిటీలు, సిట్ వేసినా ఏదీ నిరూపించలేక పోయారు. ఇప్పుడు సీఐడీ దర్యాప్తు పేరుతో అమరావతిని తరలించడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి కుట్ర చేస్తున్నారు. జగన్ రెడ్డి విధ్వంస విధానాలను ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు