పెళ్లి చూపుల కోసం విజయవాడ వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (11:58 IST)
పెళ్లి చూపుల కోసం ఓ ముఖ్యమంత్రి విజయవాడ వచ్చారు. ముఖ్యమంత్రి ఏంటి.. పెళ్లి చూపులకు రావడం ఏంటనే కదా మీ సందేహం. అవునే.. నిజమే.. కర్ణాటక ముఖ్యమంత్రి విజయవాడలో పెళ్లి చూపుల కోసం వచ్చారు. ఆయన తన సతీమణి, బంధువులతో కలిసి ఇక్కడకు వచ్చారు.
తమ కుటుంబంలోని ఓ వ్యక్తికి పెళ్లి సంబంధం చూసేందుకు ఆయన విచ్చేశారు. విజయవాడకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను తమ ఇంటి కోడలిగా చేసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.