జూలై 10 నుంచి జూలై 23 వరకు ఆన్ లైనులో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పేద, అనాథ, బడి బయటి పిల్లలు, డ్రాపౌట్ (మధ్యలో బడి మానేసినవారు) బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని తెలిపారు.
సంబంధిత పాఠశాల నోటీసు బోర్డులో, సమగ్ర శిక్షా వెబ్ సైట్ (https://ssa.ap.gov.in/SSA/)లోనూ చూసుకోవచ్చన్నారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 9494383617, 9441270099 నంబర్లను సంప్రదించాలని కోరారు.