పరిటాల శ్రీరామ్ వివాహం కంటే ఆ వివాహానికి వచ్చిన పయ్యావుల కేశవ్, కెసిఆర్‌లు కలవడం మాత్రం తీవ్ర చర్చకు తెరతీసింది. అందులోను హెలిప్యాడ్ వద్ద కెసిఆర్, పయ్యావుల కేశవ్‌ను చేతులు పట్టుకుని మరీ తీసుకెళ్ళడం మరింత చర్చకు దారితీసింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పయ్యావుల కేశవ్ పార్టీపై కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఈ నాయకుడు ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి గెలుస్తావు. ఆ తరువాత మంత్రి పదవి నీకు ఖాయం. నా మాట విను అంటూ చెప్పుకొచ్చారట. అయితే పయ్యావుల కేశవ్ మాత్రం దీనిపై ఆలోచనలో పడిపోయినట్లు సమాచారం. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. అందులోను అనంతపురం జిల్లాలో ఉండే తను హైదరాబాద్‌కు వెళితే ఎలా ఉంటుందోనన్న ఆలోచనలో ఉండిపోయారు కేశవ్. కాస్త ఆలోచించుకునే సమయం ఇవ్వండని కెసిఆర్‌ను కోరినట్లు చెప్పుకుంటున్నారు.