బడుగు బలహీనవర్గాలకు టీఆర్‌ఎస్ అధిక ప్రాధాన్యమిచ్చిందని కొనియాడారు. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా డ్రామాలు చేస్తున్నారని, ఎక్స్ అఫీషియో సభ్యులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
ఏపీ ఎంపీని తీసుకొచ్చి నేరేడుచర్లలో గెలవానుకున్నారని, ఉత్తమ్‌కు సిగ్గులేకున్నా… కేవీపీకి లేదా? అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు ఒక్క సీటు కూడా గెలిపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు.