Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

చిత్రాసేన్

శుక్రవారం, 31 అక్టోబరు 2025 (09:41 IST)
Rohit Nara's wedding with actress Siri Lella, Nara Chandrababu Naidu, Bhuvaneswari, Nara Lokesh
రోహిత్ నారా వివాహం సిరి లెల్లాతో గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, నారా లోకేష్ కుటుంబ సభ్యులు హాజరై వధూ వరులను దీవించారు. అనేక మంది రాజకీయ మరియు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రతినిధి 2లో శిరీష పేరుతో వెండితెరకు పరిచయమైంది సిరి లెల్లా. 
 
షూటింగ్ లో జంటగా నటించడంతో ఇరువురూ ప్రేమకు చాలా దగ్గరయ్యారు. అక్కడ ప్రేమకు బీజం పడి నేటితో నిజ దంపతులయ్యారు. శిరీష ది ఆంధ్రప్రదేశ్ లోని రెంటచింతల. ఆస్ట్రేలియాలో చదువు అభ్యసించి అక్కడే ఉద్యోగం చేశారు. అయితే నటనపై ఆసక్తితో ఆమె తన సోదరి ప్రియాంక వుంటున్న హైదరాాబాద్ వచ్చి సినీ ప్రయత్నాలు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు