పశువుల పాకలో సేదతీరుతున్న కొడాలి నాని

సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:11 IST)
మొన్నటివరకు రాష్ట్ర మంత్రిగా పెత్తనం చెలాయించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇపుడు పశువుల పాకలో సేద తీరుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రిపదవి దక్కలేదు. దీంతో ఆయన ఇపుడు తన ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం తన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు. 
 
అయితే, కొడాలి నానికి మంత్రి పదవి ఇవ్వకపోయినప్పటికీ ఆయనకు కేబినెట్ హోదాతో ఛైర్మన్ పోస్టును ఇవ్వనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ముఖ్యంగా, ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్‌గా కొడాలి నానిని నియమించనున్నారు. 
 
మరోవైపు, మంత్రి పదవిని కోల్పోయిన తర్వాత కొడాలి నాని పెద్దగా బయట కనిపించడం లేదు. నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. కేవలం తన ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి పదవి తనకు అక్కర్లేదని, పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తన వంత కృషి చేస్తానని కొడాలి నాని ప్రకటించారు. కానీ, ఆయన మాత్రం పెద్దగా యాక్టివ్‌గా కనిపించక పోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు