ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ధనంజయులు, సూపరింటెండెంట్లు శ్రీ వెంకటాచలపతి, శ్రీ వెంకటేశయ్య, ఆలయ అర్చకులు శ్రీ రఘవాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
21-04-2021(బుధవారం) ధ్వజారోహణం(మిథునలగ్నం) శేష వాహనం
22-04-2021(గురువారం) వేణుగానాలంకారము హంస వాహనం
23-04-2021(శుక్రవారం) వటపత్రశాయి అలంకారము సింహ వాహనం
24-04-2021(శనివారం) నవనీత కృష్ణాలంకారము హనుమత్సేవ
25-04-2021(బుధవారం) మోహినీ అలంకారము గరుడసేవ
26-04-2021(ఆదివారం) శివధనుర్భంగాలంకారము కళ్యాణోత్సవము/ గజవాహనము