అనంతరం చిత్రం గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ, చిరంజీవి గారి ఘరనా మొగుడు, రౌడీ అల్లుడు వంటి సినిమాలు చూశాను. ఆయనతో సినిమా చేయాలనుకున్నా. ఈ సినిమాతో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవిగారిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు రెట్టింపుగా వుటుంది. వెంకటేష్ గారు ఆయన వాయిస్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఆయన వాయిస్ ఇచ్చారు. ఆయన ఎంట్రీ కూడా ఇవ్వబోతారు. అది పండగకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం. చిరంజీవిగారి మేనరిజం, పాట, ఆట ఎక్కడో చోట అందరూ అనుకరిస్తారు. మన శంకర వర ప్రసాద్ గారు పండుగకి వస్తున్నారు.
చిరంజీవిగారిని సూట్ లో ఎలా వుంటారనేది నాకు చూడాలనిపించింది. అందుకే గ్లింప్స్ లో అలా చేశాం. సినిమాలో కూడా అంతకు మించి వుంటుంది. ఆయన వెయిట్ లాస్ అయి, రెండు పూటలు జిమ్ చేశారు. ఆయన ఒరిజినల్ చిరంజీవిగారే.. ఇక ఇందులో బిజీయిమ్ భీమ్స్ ఇచ్చారు. కెమెరా మెన్ కూడా అద్భుతంగా తీశారు. చిరంజీవిగారి మేనరిజాలు గత సినిమాల్లోవి అక్కడక్కడా వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఇందులో ఇంటిలిజెన్స్ ఆఫీసులో ఆఫీసర్ గా నటిస్తున్నారని తెలిపారు. దానికి ఎంటర్ టైన్ జోడించి ఫ్యాన్స్ కు విందులా వుంటుందని తెలిపారు.