కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటుపల్లి గ్రామంలో, ఓ అపార్ట్మెంట్లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. అర్ధ రాత్రి 2 గంటల సమయంలో కర్రలు చేత బట్టుకుని, చెడ్డిలపై అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన ఐదుగురు అగంతకులు ఒకరి వెనుక ఒకరు అంగలు వేసుకుని లోనికి వచ్చేశారు.
అర్ధరాత్రి అలికిడి అవ్వటంతో అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ యజమాని క్యారీడార్లో లైట్లు వేయడంతో ఆగంతకులు కంగుతిన్నారు. వెంటనే బయటకు పరారయ్యారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఆగంతుకుల దృశ్యాలు చూసి స్థానికులు, పోలీసులు సైతం ఖంగుతిన్నారు. వీరంతా చెడ్డి గ్యాంగ్‌గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలను చూసిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడి, నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. వీరంతా ఒక్కసారిగా మీద కలబడితే, పరిస్థితి ఏంటని అపార్ట్‌మెంట్ వాసులు గడగడలాడుతున్నారు.