కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తొలి రోజున ఎన్నిక జరుగకుండా అడ్డుకున్న అధికార వైకాపా నేతలు.. రెండో రోజైన మంగళవారం కూడా ఈ ఎన్నిక జరుగకుండా అడ్డుకున్నారు. దీంతో ఛైర్మన్ ఎన్నిక మరోమారు వాయిదాపడింది. దీంతో మున్సిపల్ కార్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి వాయిదా వేశారు.
మరోవైపు, టీడీపీ నేతలు వైకాపా నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేశ్‌ల కన్నుసన్నల్లో వైకాపా సభ్యులు నినాదాలు చేస్తూ ఎన్నిక సక్రమంగా జరుగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.