"కింగ్డమ్" చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
కాగా, మొన్ననే "కింగ్డమ్" సినిమాలోని విడుదలైన 'అన్న అంటేనే..' పాట భావోద్వేగానికి గురిచేసింది అని సోదరుడు ఆనంద్ దేవరకొండ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'నేను ఏదైనా సాధించగలను అని నాకన్నా ఎక్కువగా నమ్మి అండగా నిలబడే వ్యక్తి మా బ్రదర్. అన్నాదమ్ముల మధ్య ఉండే అనుబంధాలను గుర్తుచేసేలా ఈ పాట ఉంది..' అని తన పోస్ట్ లో పేర్కొన్నారు ఆనంద్ దేవరకొండ. ఈ పోస్ట్ లో సోదరుడు విజయ్ తో తీసుకున్న చిన్నప్పటి ఫోటోస్ షేర్ చేశారు.