హ‌నుమాన్ జంక్ష‌న్లో భారీగా మ‌ద్యం బాటిళ్ల ప‌ట్టివేత‌

బుధవారం, 1 డిశెంబరు 2021 (14:37 IST)
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు ఇద్ద‌రు నిందితులు అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ ఆదేశాల మేరకు, డిఎస్పీ బి శ్రీనివాసులు ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ సిఐ సతీష్ , ఎస్సైలు గౌతమ్ కుమార్, ఉషా రాణి హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహన తనిఖీ చేశారు.


గుడివాడ రోడ్డు వైపు నుండి నూజివీడు రోడ్డు వైపు వస్తున్న ఎపీ16 బిటి  5977 ALTO కారు ను ఆపి చూడగా, ఇద్దరు వ్యక్తులు కారులో అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా చేస్తూ, ప‌ట్టుబ‌డ్డారు. వారి వివరాలు అడుగుతుండ‌గానే, ఇద్ద‌రు స‌మాధానం చెప్పకుండా కారు దిగి పారిపోయేందుకు య‌త్నంచారు. దీనితో వారిని పట్టుకుని 930 మ‌ద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 
 
 
నిందితులు ఇద్ద‌రు మొవ్వ ప్రసాద్, మద్దాల రమేష్ గా పోలీసులు గుర్తించారు. మ‌ద్యం విలువ ల‌క్షా 29 వేల‌ని తెలిపారు. నిందుతులపై కేసులు నమోదు చేసి వారిని  కోర్టుకు రిమాండుకు పంపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన హనుమాన్ జంక్షన్  పోలీసుల‌ను డిఎస్పీ బి శ్రీనివాసులు అభినందించి, రివార్డులకు సిఫారసు చేస్తామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు