కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. పసికందు కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు మృగాల్లా ప్రవర్తించారు. మానవత్వాన్ని మంటగలిపేశారు. పసికందు కాళ్లూచేతులు మెలితిప్పి విరిచేశారు. ఆపై ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఆసుపత్రిలో ప్రభుత్వాసుపత్రి వద్ద ఓ పసికందు హృదయవిదారక స్థితిలో, గుక్కపట్టి ఏడుస్తూ స్థానికుల కంటబడింది. దీంతో వారు ఆ శిశువును ఆసుపత్రికి తరలించారు.
అత్యంత పాశవికంగా ఆ పసికందు బాలిక కాళ్లు, చేతులు విరిచేశారని వైద్యులు నిర్ధారించారు. ఆ బాధ తాళలేక బాలిక ఏడుస్తోందని చెప్పారు. నియోనేటల్ ఐసీయూలో చేర్చిన వైద్యులు పసికందుకు చికిత్స అందిస్తున్నారు. ఇంత రాక్షత్వానికి పాల్పడ్డది ఎవరు? అన్న దిశగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల సీసీ పుటేజ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.