బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

సెల్వి

గురువారం, 20 ఫిబ్రవరి 2025 (19:58 IST)
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి శ్రీలీల.. అగ్రనటులతో పాటు యంగ్ హీరోలతో కలిసి నటించింది. ఆమె డ్యాన్స్‌కు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఆమె కెరీర్‌లో అంతగా హిట్స్ లేకపోవడంతో అమ్మడు రూటు మార్చింది. పుష్ప-2లో కిస్సింగ్ సాంగ్ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.  
 
శ్రీలీల ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో చిత్రానికి రూ.3 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. అలాగే 
శ్రీలీల ఇప్పుడు తన మొదటి బాలీవుడ్ చిత్రానికి సంతకం చేసింది. కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1.75 కోట్ల తక్కువ పారితోషికాన్ని తీసుకునేందుకు ఓకే చెప్పిందని టాక్ వస్తోంది. 
 
తొలి హిందీ సినిమా కావడంతో ఆ సినిమా హిట్ అవుతుందో లేదో అనే అనుమానంతో ఆమె పారితోషికం తగ్గించిందని సమాచారం. ఇకపోతే.. బాలీవుడ్ చిత్రం చావాలో తన పాత్రకు రష్మిక మందన్న రూ.4 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. ఇది దక్షిణ భారత చిత్రాలకు ఆమె తీసుకుంటున్న పారితోషికంతో సమానం అని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు