తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎట్టకేలకు స్పందించారు. జూన్ 1న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసి సీఎం కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేసారని చెప్పారని ఎల్ రమణ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిసి రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచన చేస్తున్నారని అడిగారని కూడా ఆయన తెలిపారు.