ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆయనను ఫోన్ ద్వారా టీఆర్ఎస్‌కు ఆహ్వానించినట్లు ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి టీడీపీలో కొనసాగిన ఎల్.రమణ.. టీడీపీ హవా ఉన్న రోజుల్లో మంచి విజయాలు సాధిస్తూ వచ్చారు.
మరోవైపు టీటీడీపీని వీడేందుకు సిద్ధమైన ఎల్.రమణను చేర్చుకునేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోందని.. వారి కంటే ముందుగానే ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్ యోచిస్తోందనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోగా.. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా పార్టీని వీడితే తెలంగాణలో టీడీపీ దాదాపుగా కనుమరుగైనట్టే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.