సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళదాం: చెవిరెడ్డి

శుక్రవారం, 1 జనవరి 2021 (19:56 IST)
ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నిరుపేద విద్యార్థులకు ఉపయుక్తమైన విద్యా సామగ్రిని అందించి పలువురు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ముందస్తుగా చెవిరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు, పార్టీ శ్రేణులు, అధికారుల నుంచి విశేష స్పందన లభించింది.

పూలమాలలు, బొకేలు, స్వీట్లు, శాలువాలు స్థానంలో    నిరుపేద విద్యార్థులకు ఉపయుక్తమైన విద్యాసామాగ్రిని అందించాలని కోరారు. ఇలా అయన సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సరికొత్త ఆలోచనలతో ప్రజలందరూ విజయవంతంగా ముందుకు సాగాలని చెవిరెడ్డి ఆకాంక్షించారు.

ప్రభుత్వ విప్ ఓఎస్డీ లు రంగస్వామి, కిరణ్ కుమార్, రూరల్ తహశీల్దార్ భాగ్యలక్ష్మి, ఎంపిడిఓ లు సుశీల దేవి, రాధ, ఇతర అధికారులు విద్యా సామాగ్రి నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు తదితరాలను అందజేశారు.  ఇలా పలువురు విద్యా సామాగ్రిని అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తన పిలుపునకు విశేష  స్పందన లభించడం పట్ల చెవిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనకు అందిన విద్యా సామగ్రిని మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలలకు అందజేయనున్నట్లు తెలిపారు.

తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ, తిరుపతి ఆర్డీఓ కనకనరసా రెడ్డి, సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండారెడ్డి, రూరల్ సబ్ రిజిస్ట్రార్ సుబ్రమణ్యం, ఏఎస్పీ సుప్రజ, ఇతర పోలీస్ అధికారులు, ఎంపిడిఓ లు సుశీల దేవి, రాధ, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నారు. శుభాకాంక్షలు తెలియజేసేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులకు తుమ్మల గుంట లో ఎమ్మెల్యే నివాసం వద్ద టిఫిన్, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు