పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

శుక్రవారం, 13 నవంబరు 2020 (20:05 IST)
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. మూడు రోజుల పాటు సాగిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. కంకణ బట్టర్ గిరిధర్ ఆచార్యులు ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కంకణదారులైన ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడు రోజుల పాటు గ్రామ పొలిమేర దాటకుండా నిష్టగా ఈ వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నారు.
 
ఏడాది పొడ‌వునా స్వామివారి ఉత్స‌వాలు, సేవ‌ల్లో జ‌రిగిన చిన్నపాటి దోషాలను నివారించి సంపూర్ణ ఫలాన్ని మాన‌వాళికి అందించేందుకు చేపట్టిన  పవిత్రోత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయని చెవిరెడ్డి పేర్కొన్నారు. ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హించిన అర్చ‌క బృందానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 
ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, కుంభ సమారోపన, పవిత్ర విసర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు