ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ రంజాన్ మాసంలో సర్వ మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని, రంజాన్ మాసంలో ఇంట్లోనే నమాజ్ చేసి కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ముస్లిం సోదరులను అభ్యర్ధించారు.
ఈ నెలాఖరున జరిగే రంజాన్ పండుగ రోజున ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సంతోషంగా సేమియా చేసుకోవడానికి అవసరమయ్యే సేమియా, నేతి ప్యాకెట్ , పంచదార , కిస్ మిస్ , జీడిపప్పు అందచేసిన బాషా మంచి మనస్సును అల్లా దీవిస్తారని మంత్రి పేర్ని నాని అన్నారు.
ఈ రంజాన్ తోఫా కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ అచ్చాబా , 19 వ వార్డు ఇంచార్జీ బూరుగ రామారావు, షేక్ జిలాని బాషా, మాజీ కౌన్సిలర్ మేడికొండూరు మధు తదితరులు పాల్గొన్నారు.