మిస్డ్ కాల్‌తో మొదలైన ప్రేమాయణం, ఇద్దరు పిల్లల్ని, భర్తను వదలి మహిళ పరార్

గురువారం, 9 జులై 2020 (11:11 IST)
ఓ మిస్డ్ కాల్  ఓ మహిళ అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆఖరికి ఆమె భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి ప్రియుడితో పరారైంది. ఎట్టకేలకు ఆ విషయం బయటపడడంతో అటు భర్త, ఇటు ప్రియుడు ఇద్దరూ వద్దన్నారు.

ఇద్దరు మగాళ్లతో ఎంజాయ్ చేసిన ఆమె రెండు జిల్లాల్లో తిరగడంతో ఇప్పుడామెకు కరోనా టెస్ట్ చేశారు. ఆమెతో పాటు చేసిన అందరి టెస్టుల ఫలితాలు రాగా.. ఆమెది మాత్రం రాలేదు. దీంతో ఆమె ఇప్పుడు టెన్షన్ లో వుంది. వివరాల్లోకి వెళితే...
 
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా సేరన్‌ మహాదేవికి చెందిన కూలీ కార్మికుడికి, పాళయంకోటై కృష్ణాపురానికి చెందిన మహిళకి పదేళ్ల ముందు వివాహం జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల పరామర్శలతో పెరుగుతూ వచ్చిన ఆ మహిళ వద్ద నగలు, నగదు వంటివి ఏమీ తీసుకోకుండా కూలీ కార్మికుడు వివాహం చేసుకున్నాడు.

వీరికి 8 ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో ఒక్కటిన్నర సంవత్సరాల ముందు ఆ మహిళకి ఓ మిస్డ్‌ కాల్‌ వచ్చింది. కాయత్తార్‌కి చెందిన యువకుడితో పరిచయమై కాలక్రమేణా ప్రేమగా మారింది. ప్రేమ మత్తులో ఉన్న ఆ మహిళ ఆ యువకుడి వద్ద తనకు వివాహం జరిగి పిల్లలు ఉన్నారనే విషయాన్ని దాచిపెట్టింది.

ప్రియుడిని కలవడానికి వెళ్లినప్పుడు మంగళసూత్రాన్ని తీసేసి బ్యాగులో పెట్టుకుని తిరిగింది. 29 ఏళ్ల ఆ మహిళ 24 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడానికి పథకం వేసింది. 
 
అనంతరం ఆ మహిళ గత 20వ తేదీ నాగర్‌కోవిల్‌లో ఇంటర్వ్యూ అని భర్తకు చెప్పి వెళ్లింది. తరువాత ప్రియుడితో తెన్‌కాశి సమీపంలో సుందరపాండియన్‌ పురానికి వెళ్లిన ఆ మహిళ.. 24వ తేదీ వివాహం చేసుకుది. ఈ విషయం తెలియని భర్త తన భార్య కనబడడం లేదని సేరన్‌ మహాదేవి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఫొటోని ఆ మహిళ తన ఫొన్‌లో స్టేటస్‌గా పెట్టింది. దీన్ని ఆమె బంధువులు, కుటుంబీకులకు తెలిపిన అనంతరం వారు సేరాన్‌ మహాదేవి పోలీసులకు తెలిపారు. వారు కయత్తార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు జులై 1వ తేదీ ఇద్దరినీ పిలుచుకుని విచారణ చేసినప్పుడు ఆ మహిళకు ముందుగానే వివాహం జరిగి పిల్లలు ఉన్నట్లు తెలిసింది.

దాంతో ఆ యువకుడు ఆమెను అంగీకరించలేదు. సేరణ్‌ మహాదేవి పోలీసులు గత రెండో తేదీ ఆమెను పిలుచుకుని వెళ్లి వచ్చారు. దీనిపై భర్త, బంధువులకు తెలిపితే వారు కూడా ఆమెను అంగీకరించలేదు. ఆమెను ఆ రోజు రాత్రి సేరన్‌ మహాదేవిలో ఉన్న కరోన శిబిరంలో ఉంచారు. ఆ మహిళను అంగీకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు.

వేరే జిల్లా నుంచి మహిళ రావడం వల్ల ఆమెకు జులై 4వ తేదీ వరకు కరోనా టెస్ట్ చేశారు. శిబిరంలో ఉన్న మిగతా వారికి కరోనా టెస్ట్ రిజల్ట్‌ వచ్చినా, ఈమెకి మాత్రం రిజల్ట్‌ వెయిటింగ్‌లో ఉంది. మూడు రోజులుగా ఆ మహిళ శిబిరంలోనే ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు