బంగాళాఖాతంలో అల్పపీడనం.. 3 నుండి భారీ వర్షాలు

గురువారం, 1 ఆగస్టు 2019 (07:56 IST)
అల్ప పీడనం కారణంగా ఆగస్టు 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్రాలో ఆగస్టు 3 నుండి 6 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆగస్టు 4, 5వ తేదీల్లో దక్షిణ కోస్తా, మాధ్య కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలలు ఉవ్వెతున ఎగసి పడుతుంటాయి. అలలు 2.5 మీటర్లు నుండి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడుతుంటాయి. ప్రజలు తీరప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈదురు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది 
 
జాలర్లు చేపలవేటకు వెల్ళకూండా ఉండాలి. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు