దీనిపై ఆమె తండ్రి స్పందిస్తూ.... గత రాత్రి స్వాతి అంతు చూస్తామంటూ, ఆమె ఎలా బతుకుతుందో చూస్తామంటూ బెదిరింపులు వచ్చాయని, అంతేకాకుండా ఆమె శీలాన్ని కించపరుస్తూ అత్తింటివారు పుకార్లు పుట్టిస్తున్నారని స్వాతి తండ్రి వాపోయారు. మధుకర్ రెడ్డి బంధువు రవీందర్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని... మధుకర్ రెడ్డి అంత్యక్రియల రోజున తమపై దాడి చేసింది రవీంద్ర రెడ్డేనని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా, స్వాతి ఆత్మహత్య చేసుకో ప్రయత్నలో భాగంగా హార్పిక్ సేవించింది. మోతాదుకు మించి ఈ రసాయనం తాగడంతో ఆమె అన్నవాహిక బాగా దెబ్బతింది. దీంతో ఆమె సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ముఖ్యంగా.. ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే ఆమెను కాపాడడం కష్టమని వైద్యులు చెప్పారు.