మైత్రీ రోబోను ఆదివారం హార్ష అకాడమీ డైరెక్టర్ తనూజ్ కుమార్ కలెక్టర్ ఇంతియాజ్ కు అందచేసారు.ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యసేవలకు ఎంతగానో ఉపయోగపడే రోబోను తయారుచేసి అందచేసినందుకు సర్క్యూట్ గ్రిడ్ ను, హర్షా అకాడమీ వారిని కలెక్టర్ అభినందించారు.
ఈ సంధర్భంగా రోబో పనితీరును సర్క్యూట్ గ్రిడ్ టెక్నికల్ హెడ్ దుర్గాప్రసాద్ వివరిస్తూ ఈ మైత్రీ రోబో వైఫై టెక్నాలజీతో పనిచేస్తుందనీ, దీనిని 20 అడుగుల దూరం నుండి మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ కరోనా రోగులకు ఆహారం ,మందులు అందించవచ్చని, తద్వారా వైద్యసిబ్బంది కరోనా వైరస్ బారినపడకుండా కాపాడవచ్చని తెలిపారు.