కరోనా రాకుండా ఉండేందుకు చిట్కా పాటించి ఓ యువకుడు చనిపోగా, ఇద్దరు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మచ్చ బొల్లారం పరిధి చంద్రనగర్ కాలనీకి చెందిన సురేశ్(30) ప్రైవేటు ఎంప్లాయ్. పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగితే కరోనా రాదని ఇరుగు పొరుగు ఇచ్చిన సలహాతో సురేశ్‌తో పాటు అతని భార్య సంధ్య, తల్లి లక్ష్మి కొంతకాలంగా పాటిస్తున్నారు.
మంగళవారం రాత్రి కూడా వారు పాలలో నల్ల ఉప్పు వేసుకొని తాగారు. కొద్దిసేపటికి ముగ్గురు వాంతులు చేసుకోగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. సురేశ్ కండీషన్ సీరియస్‌గా ఉండగా గాంధీ ఆస్పత్రికి తరలించగా ట్రీట్మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. అతని భార్య, తల్లి ట్రీట్మెంట్తీసుకుంటున్నారు. కుటుంబసభ్యుల కంప్లయింట్‌తో అల్వాల్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.