ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పరార్.. వీడియో వైరల్

శనివారం, 13 నవంబరు 2021 (12:00 IST)
తమిళనాడుకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియో వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తిరువిదాంగోడుకు చెందిన పూజారి(45) అనే వ్యక్తికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, ఇతడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరు పిల్లలను వదిలేసి 8 నెలల క్రితం ప్రియుడితో పారిపోయింది.
 
దీనిపై భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, తన భార్య ప్రియుడితో కలిసి తన గ్రామానికి పక్కనే ఉన్న తక్కలైకి వచ్చినట్లు సమాచారమందింది. 
 
దీంతో అతను తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి భార్యపై, ఆమె ప్రియుడిపై కత్తులతో దాడి చేశాడు. గాయపడిన ప్రియుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారమందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లగా అతడు పారిపోయినట్లు తెలిసింది. అయితే, దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు