కాగా ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరుకు చెందిన చంద్రశేఖర్ గురువారం మధ్యాహ్నం పట్టణానికి సమీపంలోని దాబాలో భోజనం చేశాడు. అనంతరం ఫోన్ మాట్లాడుకుంటూ దాబా వెనక్కు నడిచివెళ్ళాడు. ఇదే సమయంలో అక్కడ పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆ బావిలో 20 అడుగుల లోతు నీరు ఉంది. చంద్రశేఖర్‌కి ఈత రావడంతో బావిలో ఉన్న చెట్ల వేర్లను పట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు.
అయితే బావిలో పడిన సమయంలో కాపాడాలంటూ కేకలు వేశాడు చంద్రశేఖర్, సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు. శుక్రవారం జీవన్ కుమార్ అనే వ్యక్తి పశువులు మేపుతూ బావి సమీపంలోకి వచ్చాడు. బావిలోంచి కేకలు వినిపించాయి. వెంటనే పోలీసులకు, స్థానిక గ్రామస్తులకు సమాచారం అందించాడు.