మంగళగిరి జాతీయ రహదారిపై భారీ చోరీ, రూ.80 లక్షల విలువైన ఫోన్లు దోపిడీ

బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:46 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై భారీగా చోరీ జరిగింది. ఓ కంటెయినర్ నుంచి రూ.80 లక్షల  విలువగల మొబైల్ పోన్లను దుండుగలు చోరీ చేశారు. ఇందులో 980 మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్ నుంచి కొల్ కత్తాకు మొబైల్ ఫోన్లను కంటెయినర్లో తరలిస్తున్నారు.
 
ఆ కంటెయినర్ మంగళగిరి సమీపంలోకి వచ్చిన సమయంలో ఓ వాహనదారుడు కంటెయినర్ వెనుక భాగం తెరిచి ఉన్నట్లు గుర్తించాడు. ఆ విషయాన్ని కంటెయినర్ డ్రైవర్‌కు తెలిపాడు. దాంతో వాహనన్ని ఆపిన డ్రైవర్ వెనుక భాగంలో పరిశీలించగా అందులో చోరీ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాజా టోల్‌గేట్ వద్ద కంటెయినర్‌ను నిలిపి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని తెలిపారు. ఇదే తరహా కొన్ని వారాల క్రితం చిత్తూరు జిల్లాలో కంటైనర్ నుంచి మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. వాటి విలువ రూ.10 కోట్లు అని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు