డిసెంబరు నాటికి 5జీ స్మార్ట్ ఫోన్లు... ప్లాన్ చేస్తున్న జియో (video)

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (12:37 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది డిసెంబరు ఆఖరు నాటికి 5జీ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా, ఈ యేడాది ఆఖరునాటికి మార్కెట్లోకి 10 కోట్ల చౌక స్మార్ట్ ఫోన్లను అందించేందుకు ప్రణాళికలు రూపొందింస్తున్నట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఓ పత్యేక కథనాన్ని ప్రచురించింది. రిలయన్స్ జియో ప్లాన్ చేస్తున్న 5జీ స్మార్ట్ ఫోన్లు 4జీ, 5జీ రేడియో తరంగాలకు మద్దతిస్తాయని పేర్కొంది. ఈ ఫోన్ల తయారీ ఇప్పటికే ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రారంభైనట్టు తెలిపింది. 
 
కాగా, ఇటీవల రిలయన్స్ అనుబంధ సంస్థల్లోకి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సహా ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టగా, రిలయన్స్ ఇండియాలోనే అత్యధిక విలువైన సంస్థగా అవతరించిన సంగతి తెలిసిందే. 
 
అలాగే, జూలైలో జరిగిన వాటాదారుల సమావేశంలో ప్రసంగించిన ముఖేశ్ అంబానీ సైతం ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్‌పై 4జీ, 5జీ ఫోన్లను అందరికీ అందుబాటులోకి తెస్తామని, ఫోన్‌ను స్వయంగా రిలయన్స్ డిజైన్ టీమ్ తయారు చేస్తుందని ప్రకటించారు. ఈ ఫోన్ల ధరలు కారు చౌకగా ఉంటాయని పేర్కొంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు