ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడకు చెందిన ముక్కుట యాదాగౌడ్ (35), సౌజన్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల క్రితం వీరు హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. ప్రైవేటు ఉద్యోగి అయిన యాదాగౌడ్‌కు డీసీఎం డ్రైవర్ షేక్ ఆసీఫ్‌తో స్నేహం ఉంది.
దీంతో తరచూ యాదాగౌడ్ ఇంటికి వచ్చే ఆసీఫ్, సౌజన్య మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భర్తకు తెలిసి మందలించినా సౌజన్య పట్టించుకోలేదు. పైగా భర్త తనను హింసిస్తున్నాడని, అతని అడ్డు తొలగిపోతే మనం సంతోషంగా ఉండొచ్చంటూ ప్రియుడికి నూరిపోసింది.
వెంటనే ప్లేట్ ఫిరాయించిన సౌజన్య తన భర్తను ఆసిఫ్ చంపేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది. విచారణలో పోలీసులకు ఆసిఫ్ జరిగినదంతా చెప్పడంతో వారు ఆసిఫ్, సౌజన్య కాల్ రికార్డును పరిశీలించారు. దానిలో సౌజన్య ప్రోద్బలంతోనే ఆసిఫ్ హత్యచేశాడని నిర్ధారణ కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకెళ్లడంతో పిల్లలు అనాథలుగా మారారు.