పరస్త్రీతో సంభోగించినట్లు కల వస్తే ఏమవుతుంది?

బుధవారం, 22 జనవరి 2020 (19:13 IST)
నిద్రలో అనేక కలలు వస్తుంటాయి. ఐతే ఏ కలలు మేలు చేస్తాయి ఏ కలలు కీడు చేస్తాయన్నది జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఇపుడు శుభ ఫలితాలను ఇచ్చే కలలు ఏమిటో చూద్దాం. 
 
కలలో ఇష్ట దేవతను చూసినట్లు వస్తే శుభం. అలాగే పుష్పములు, పండ్లు, పసుపు, కుంకుమ, నిధినిక్షేపములు, మంగళకర వస్తువులను చూసినట్లు, పసుపుపచ్చని వనాలు కలలో వస్తే శుభము. గుర్రములు, ఏనుగులు లేదంటే పల్లకీ తదితర వాహనాలను ఎక్కినట్లు కల వస్తే శుభకరమే. 
 
ఇంకా తను ఏదో బాధకు గురైనట్లు, రక్తము చూసినట్లు, వేదము చదివినట్లు, పరస్త్రీని సంభోగించినట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు కల వస్తే శుభం జరుగుతుంది. నూతన వస్తు, వస్త్రభూషణములు ధరించినట్లు కల వచ్చినా శుభమే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు