పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ వైకాపా నేతలు ఆయనకు హెచ్చరికలు పంపారు. దీంతో ఆయన గురువారం ఉదయగిరి బస్టాండ్ సెంటరులో కుర్చీ వేసుకుని కూర్చొని, తనను తరిమి కొడతానన్న వాళ్లు రావాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు పెద్దల సంఖ్యలో ఆయన అనుచరులు కూడా అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడి ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
కాగా, ఇటీవల ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో వైకాపా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీదేవిలపై వైకాపా అధిష్టానం సస్పెండ్ వేటు వేసింది. అప్పటి నుంచి ఉదయగిరి వైకాపా నేతలు మేకపాటిని టార్గెట్ చేశారు. విమర్శలు చెస్తూ నియోజకవర్గంలో అడుగుపెడితే తరిమి కొడతామంటూ హెచ్చరించారు. దీంతో గురువారం ఉదయం ఆయన బస్టాండ్ సెంటర్‌కు వచ్చి బహిరంగ ఛాలెంజ్ విసిరారు.