టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల భేటీపై వైకాపా నేతలు విమర్శలు గుప్పించడంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, "చిత్తకార్తెలో కుక్కలు పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తాయి. మొరుగుతాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల భేటీపై వైకాపా నేతల అరుపులు ఆ కక్కులను తలపిస్తున్నాయి" అంటూ వ్యాఖ్యానించారు. గతంలో భిన్నధృవాలైన వామపక్షాలు, బీజేపీని ఒక వేదికపైకి తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ సొంతమన్నారు. ఇపుడు చంద్రబాబు సారథ్యంలో అది మళ్లీ పునరావృత్తమవుతుందేమో చూడాలని ఆయన అన్నారు.
కామంతో కాళ్లు నాకావు అనుకున్నాం...
ఇటీవల హైదరాబాద్ నగరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు సమావేశమయ్యారు. ఈ సమావేశంపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్ చేశారు. 'రిప్ కాపులు.. కంగ్రాచ్యులేషన్స్ కమ్మోళ్లు' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై అటు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వర్మపై విమర్శల దాడి ఎక్కుపెట్టారు.
ఇదే అంశంపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ట్వీట్ చేస్తూ.. "కామంతో కాళ్లు నాకావు అనుకున్నాం.. కానీ, పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించుకోలేదు. రిప్ ఆర్జీవీ - కంగ్రాట్స్ జగన్ రెడ్డి" అంటూ ట్వీట్ చేశారు.
జగన్ ముఠా మూడు చెరువుల నీళ్లు తాగింది..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం హైదరాబాద్ నగరంలో భేటీ అయ్యారు. ఈ భేటీపై వైకాపా నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశారు. సంక్రాంతి వసూళ్ల కోసం కలిశారని ఒకరంటే.. సంక్రాంతికి గంగిరెద్దులు ఇంటికి వెళతాయని మరో మంత్రి అన్నారు. ఇలా ఏకంగా పదికిపైగా వైకాపా మంత్రులు ఈ భేటీపై నోరు పారేసుకున్నారు. వీరు చేసిన దాడికి టీడీపీ నేతలు ధీటుగానే సమాధానం ఇచ్చారు. ఒక్క టీ కప్పు కాఫీ జగన్ ముఠాను మూడు చెరువులు నీళ్లు తాగించిందంటూ తేల్చేశారు.
ఇదే అంశంపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు - పవన్ కళ్యాణ్‌లు ఓ కప్పు టీ తాగితే జగన్ ముఠా భయంతో మూడు చెరువులు నీళ్లు తాగిందన్నారు. బాబు, పవన్ కలిస్తే ఏడుగురు మంత్రులతో అబద్ధాల దాడి చేయించటారంటే జగన్ రెడ్డికి ఎంత వణికిపోతున్నారో అర్థమైపోతుంది అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ఫోటోను ట్యాగ్ చేసి ఆ ఇద్దరూ ఓ కప్పు కాఫీ తాగారు. వైకాపా వాళ్లంతూ మూడు చెరువులు నీళ్లు తాగారు అంటూ మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. బాబు, పవన్ కలిస్తే మాకు భయం లేదని చెప్పడానికి వైకాపా నుంచి అంత మంది మంత్రులు బయటకు వచ్చారంటే .. పాపం బిడ్డలు బాగా భయపడిపోతున్నారంటూ మాజీ హో మంత్రి నిమ్మకాయల రాజప్ప అన్నారు.