ఏపీ సీఎంపై మేకపాటి సంచలన వ్యాఖ్యలు.. అలాంటి నాయకుడు ఉండకూడదు..

గురువారం, 3 మార్చి 2022 (17:20 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మేకపాటి రాజమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తలేనని.. కానీ సొంత దారులం కాదని మేకపాటి వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును ప్రజలకే అప్పగించాలని సూచించిన ఆయన.. ప్రజలకు విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు ఇలా అన్ని కార్యక్రమాలు చేయాలన్నారు.
 
అసలే, రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయిందని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే.. బాగా పనిచేయాలని గౌతమ్‌రెడ్డికి సూచించానని గుర్తు చేశారు. ఏపీని హైదరాబాద్‌ తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. కానీ, ప్రతి దాంట్లో స్వార్థం ఉండకూడదన్నారు మేకపాటి రాజమోహన్‌రెడ్డి.
 
ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారని.. ఈ స్వల్ప కాలంలో వేలకోట్లు సంపాదించి ఏం ఉపయోగం.. తగలేసుకోవడానికా? అని మేకపాటి ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ను చూస్తే మంచి నాయకత్వ లక్షణాలు వున్నాయని అనిపించేది.. వైఎస్సార్ లేని లోటు తీరుస్తానని చెప్పాను.  
 
అందుకే గత ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పానని.. అయితే, ప్రజల అభిమానం పొందాలి.. కానీ, వారిని చీట్‌ చేయొద్దు.. మభ్య పెట్టడం చేయకూడదు.. అలాంటి నాయకుడు ఉండకూడదంటూ హాట్‌ కామెంట్లు చేశారు మేకపాటి. ప్రస్తుతం మేకపాటి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైనాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు