జగనన్న గోరుముద్ద చిక్కిపై సమస్యా? ఆదిమూలపు ఏమన్నారు..?

మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (20:25 IST)
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీపై ఫైర్ అయ్యారు. ఏపీలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే చిక్కిపై వస్తున్న వివాదంపై స్పందించారు.
 
జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే చిక్కి కోసం రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు తెలిపారు. 
 
నాణ్యతను కూడా టాటా కన్సల్టెన్సీ లాంటి ఏజెన్సీ ద్వారా తనిఖీ చేయించి టెండర్లు ఇచ్చామని తెలిపారు. గ్లోబల్ టెండర్ ప్రకారం చిక్కి సరఫరా జరుగుతోందని.. తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేయడం సహేతుకం కాదని హితవు పలికారు. 
 
కోవిడ్ జాగ్రత్తలో భాగంగా ప్రతీ విద్యార్థికి 25 గ్రాముల చిక్కి ప్యాకెట్‌ను వ్యక్తిగతంగా ఇస్తున్నాం.. ఎవరికీ అక్రమంగా టెండర్లు కట్టబెట్టలేదని ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలి..' అని మంత్రి ఆదిమూలపు సూచించారు. పీఆర్సీ అంశాలపై ముందుకే వెళ్లాలని.. గడియారం వెనక్కు తిరగడం కుదరదని గుర్తించాలన్నారు.
 
ఉపాధ్యాయులు ముఖ్యమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నామని మంత్రి అన్నారు. ఏ సమస్య అయినా చర్చలతోనే సాధ్యం అవుతుందన్నారు. 
 
టీడీపీ హయాంలో నీళ్ల సాంబారు, చిన్న సైజు గుడ్లు సరఫరా చేశారని విద్యార్థులు ఆందోళనలకు దిగిన విషయాన్ని మర్చిపోవద్దని చెబుతున్నామని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు