టీడీపీకి వయసైపోయింది.. రిటైర్డ్ అయితే మంచిది: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (06:47 IST)
టీడీపీకి వయసైపోయిందని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇకనైనా రిటైరవ్వడం మంచిదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహా ఇచ్చారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏమన్నారంటే...?!
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను (గ్రామ పంచాయితీ) అనేక విడతల్లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్వహించారు. అంతకుముందు ప్రారంభించి మొదలుపెట్టిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపలేదు. వాటి గురించి నిమ్మగడ్డ ప్రస్తావించలేదు. 2014 సాధారణ ఎన్నికలకు మూడు నెలల ముందు కిరణ్ కుమార్, చంద్రబాబు ఒక్కటే అయి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గ్రామాల్లో గ్రూపులు ఏర్పడితే టీడీపీకి ఊపిరిపోస్తాయని ఎన్నికల ఆలోచన చేశారు. కిరణ్ కుమార్ ఆనాడు పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద ప్రేమ, అభిమానం ఏమీ లేదు. చంద్రబాబుకు బంట్రోతుగా గెలిపించాలని కిరణ్ కుమార్ ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎన్నికల్లో ఉంటే ఓట్లు విడిపోవని చెప్పులు నెత్తిన పెట్టుకొని చెప్పులతో పోటీ చేసిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డిది.
2014కు ముందు ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలవనివ్వకూడదని కిరణ్, చంద్రబాబు కలిసి పోటీ చేశారు. 2014 తర్వాత నుంచి 2019 వరకు (ఐదు సంవత్సరాల) స్థానిక సంస్థల ఎన్నికల కాలపరిమితి అయిపోయినా ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు. ఎందుకు పోటీ చేయలేకపోయారు. ఎందుకు వాయిదా వేస్తూ వచ్చారు. వంత పలికింది నిమ్మగడ్డ రమేశ్ చౌదరి గారే కదా! ఎన్నో కుట్రలు, కుతంత్రాలు. వారికి తోడు ఎల్లో మీడియా పనిచేస్తాయని మీ అందరికీ తెల్సు. రాష్ట్ర ప్రజలందరకీ తెల్సని తెలియజేసుకుంటున్నాను.
కరోనా సాకుతో బాబు కోసం నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారు
ఎన్నికల ప్రక్రియ మీరంతా చూశారు. ఒకవైపు ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చి.. మరోవైపు మూడే మూడు కరోనా కేసులు. ఆనాడు కరోనాతో చనిపోయిన దాఖలాలు లేవు. వ్యాధిగ్రస్తులు ఎక్కువగా లేరు. అయినా స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ను నిమ్మగడ్డ వాయిదా వేశారు. ఇదంతా కేవలం కుట్రపూరితం. మీ అందరికీ తెల్సు. సుజనా చౌదరి.. కావాల్సిన వారంతా ఓ స్టార్ హోటల్‌లో కలిసింది సీసీ కెమెరాల్లో చూశాం.
మరి, ఆ విధంగా కుట్రపూరితంగా, పక్షపాతంతో ఒక కులానికి వంతపాడుతూ రమేశ్ ఎన్నికలను వాయిదా వేశారు. చివరకు నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లారు. మార్చి 18, 2020న హోంశాఖకు ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం అని లేఖ కూడా రాశారు. ప్రజలు పట్టం కట్టిన ప్రభుత్వాన్ని, పార్టీని తూలనాడుతూ కోర్టుకు పోతే.. కోడ్ ఎత్తేయకుండా మూడు, నాలుగు నెలలు ఎన్నికలను వాయిదా చేశాము.
ప్రభుత్వ పాలన కూడా మేమే నిర్వహించాలి ఏమీ లేకుండా 24 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి వంతపలుకుతూ కోడ్ తీసేయకపోతే సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కోడ్ ఎత్తేయమని చెప్పింది. ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రభుత్వం మీద, మా నాయకుడు జగన్ మీద దురాలోచనలు చేశారు.
ప్రజా ప్రభుత్వం ఉంటే.. నాలుగు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలా?
స్థానిక ఎన్నికల్లో జగన్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నవంబర్ 17న ఇంకో నిర్ణయం చేశారు. పంచాయితీ ఎన్నికలు కూడా నాలుగు దఫాలుగా నిర్వహించారు. ఇదేమి ప్రజాప్రభుత్వం కాదా? ప్రజలు 51% మెజార్టీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి.. 151 స్థానాల్లో ఎమ్మెల్యేలు, 22 ఎంపీలను గెలిపించిన ఘనత జగన్ ది.
ఇలాంటి ప్రభుత్వం మీద నాలుగు విడతల్లో ఎన్నికలు జరిపిన ఘనత నిమ్మగడ్డ రమేశ్ చౌదరిది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 14 మందికి తిరిగి నామినేషన్ వేసుకోండి.. పోటీ చేయండని అవకాశం కల్పించారు. మున్సిపల్, స్థానిక సంస్థల, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో ప్రజాతీర్పు ద్వారా తెలిపారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీలపై టీడీపీ, జనసేనలు హైకోర్టులో సింగిల్ జడ్జి దగ్గరకు పోవటం ఎన్నికల కౌంటింగ్‌ను ఆపుచేశారు. సెప్టెంబర్ 16న సింగిల్ జడ్జి ఇచ్చిన నిర్ణయం మీద హైకోర్టు బెంచ్ ఎన్నికల కౌంటింగ్ జరగాలని తీర్పు చెప్పటం చాలా సంతోషం. అదే విధంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఎన్నికల సందర్భంగా ప్రప్రధమంగా ప్రజలంతా జగన్ పక్షాన నిలబడ్డారు. ఈ తీర్పు చంద్రబాబు, జనసేన, వారికి వంతపాడుతున్న ఎల్లో మీడియాకు చెంపపెట్టు అని చెప్పకతప్పదు.
నా రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంను ఇంతవరకు చూడలేదు
ఒంటరిగా పోటీ చేసి 51% ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చి చెప్పిన మాట తూ.చా. తప్పకుండా నెరవేరుస్తున్నారు
గతంలో ఎన్నడూ ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. నేను కూడా యూనివర్శిటీలో చదువుకున్నప్పుడు కానీ, 1975 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో మాట చెప్పి.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది తూ.చా.తప్పకుండా నెరవేర్చిన ఘనత జగన్ ది.
\
గుంటూరు ప్లీనరీలో జగన్ నవరత్నాలు ప్రజలకు అందజేస్తాం. తద్వారా పేదరికాన్ని తొలగిస్తామని చెప్పారు. జగన్ తప్ప ఏ నాయకుడూ 3648 కి.మీ పాదయాత్ర చేసిన నాయకుడు ఎవ్వరూ లేరు. పాదయాత్రలో ఆయనకు వచ్చిన ఆలోచనలు, నవరత్నాలు, మేనిఫెస్టోలో మేధావులు ఇచ్చినవన్నీ పొందిపరిచి మొదటి సంవత్సరంలో 90% అమలు చేసి.. రెండో సంవత్సరం 90% పైన పూర్తి చేశారు. ఇలా హామీలు పూర్తిచేసిన ఘతన ఒక్క జగన్ కి తప్ప ఇంకెవ్వరికీ లేదన్నది నిర్విదాంశం.
ఎందుచేతనంటే.. వారు చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాం... మన పని అయిపోయినట్లు చంద్రబాబు చెప్పినట్లు అనుకోలేదు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు నూటికి ఒక్క శాతం కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. రెండేళ్లలో 90%పైగా హామీలు పూర్తి చేసిన ఘనత జగన్ దే. ఇలా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలు అమలు చేయలేదు. జగన్ పరిపాలన ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించింది.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎప్పుడో అంతరించింది.
టీడీపీకి వయసైపోయింది. రాజకీయాల నుంచి చంద్రబాబు రిటైర్డ్ అయిపోతే మంచిది. ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ ఎప్పుడో అంతరించిపోయింది. ఎన్టీఆర్ నుంచి టీడీపీని చంద్రబాబు లాక్కొన్నారు. చివరకు చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను ఎందుకూ పనికిరానివాడిగా చేశాడు. మీ పార్టీకి వయసైపోయింది. మీకు రాజకీయాలెందుకు. వయసు మీరిన పార్టీకి అండగా నిలిచే పరిస్థితి లేదు.
కుమారుడుకు చంద్రబాబు రాజకీయాల్లో ఓనమాలు కూడా నేర్పించలేదు. కేవలం వ్యాపారం ఏ విధంగా చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలో చంద్రబాబు తన కుమారుడికి నేర్పించారు. ఆ ప్రక్రియ హైదరాబాద్ నుంచే చేయండి. రాష్ట్రానికి వచ్చి ఉద్రిక్తతలు లేపటం.. వాటిని భూతద్దంలో నుంచి ఎల్లో మీడియా చూపించటం చేస్తోంది. ఇవన్నీ దురదృష్టకరమైన పరిస్థితులు.
ఈ రెండేళ్లలో దాదాపు రూ.లక్ష కోట్లు ప్రజలకు DBT ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. తద్వారా రాష్ట్ర జీడీపీ తగ్గిపోకుండా.. రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయటం జరిగింది. దీనిపై ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా విపత్కార పరిస్థితుల్లో హెలికాప్టర్ మనీ సర్క్యులేట్ చేస్తే మంచిదని చెప్పారు. దాన్ని పరోక్షంగా ఎన్నికల హామీల ద్వారా జగన్ ఇవ్వటం ద్వారా ఏపీలో ఆర్థిక ఇబ్బంది ఉందనే ఆలోచన రాకుండా పనిచేశారు.
ఓవైపు ఎన్నికల హామీలు.. రాష్ట్రం దివాళా తీయకుండా హెలికాప్టర్ మనీ అమలు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి దే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని, పార్టీని, జగన్ మోహన్ రెడ్డిపై ఎవరు ఎన్ని చెప్పినా, అన్నా.. ఈ ఫలితాల ద్వారా ప్రజా తీర్పు తెలుస్తోంది.
ఫలితాలు ఊహించే చంద్రబాబు పలాయనం
ఎన్నికల నుంచి ఎందుకు తప్పుకున్నారో చంద్రబాబుకు తెల్సు. వచ్చే ఫలితాలు చంద్రబాబుకు ఏ విధంగా ఇవి ఇబ్బందిపెడతాయో అని ఎన్నికల నుంచి తప్పుకున్నాను. మేం బాయ్‌కాట్ చేస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బాయ్‌కాట్ చేస్తున్నామని అనటం అంటే.. పరాజయాన్ని ఒప్పుకోవటమే. రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారో.. చంద్రబాబుకు కూడా అనుభపూర్వకంగా తెల్సు.
మరి అలాంటప్పుడు కుప్పంలో చంద్రబాబు డబ్బులు ఎందుకు పంచారు. డబ్బులు పంచినా కూడా కేవలం రెండు ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. 75 స్థానాలు ఎందుకు గెలవలేకపోయావు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాకముందు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మజ అనే మహిళ గెలవటం జరిగింది. ఆరోజుల్లో వైస్ ఎంపీపీ కూడా అయింది. ఎప్పుడు కూడా చంద్రబాబు నేలవిడిచి సాము చేశారు.
పొత్తులేకుండా ఎప్పుడైనా అధికారంలోకి వచ్చావా బాబూ!
గతంలో రామారావును అడ్డంపెట్టుకొని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇంకోసారి వాజ్‌పేయిని అడ్డంపెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ఇంకోసారి మోడీని అడ్డంపెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ఈ మూడు పర్యాయాలు కూడా నడవలేని వ్యక్తి ఎలా నడుస్తారో.. వారిని అడ్డంపెట్టుకొని అధికారంలోకి వచ్చారు. అంతే తప్ప ఒంటరిగా ఎప్పుడైనా పోటీ చేశారా? కానీ, జగన్ పై ఇతర పార్టీలతో కలిసి పోవాలని ఒత్తిడి చేశారు. కుదరదు.
గెలుపైనా, ఓటమైనా ఒంటరిగా పోటీ చేయాలని జగన్ పోటీ చేశారు. సొంత బలంతో ఒంటరిగా 51% ఓట్లతో శ్రీ జగన్ అధికారంలోకి వచ్చారు. ఇతరులతో పొత్తులేకుండా ఎప్పుడైనా అధికారంలోకి వచ్చావా బాబూ! ఆ విధమైన ధైర్యం ఎప్పుడైనా చేశావా. ఈరోజున జగన్ తో పోల్చుకుంటూ రాజకీయాలు చేయాలనుకోవటం ఏంటి బాబు. లోకేశ్‌ను జగన్ తో సరిసమానంగా ప్రమోట్ చేయాలని చంద్రబాబు ఆలోచన చేయటం పిచ్చినతం.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం ఏ పార్టీలు ఎన్ని చేసినా పొత్తులు, చేతులు కలిపినా.. 51% కంటే ఎక్కువ ఓట్లు వైయస్‌ఆర్‌సీపీకి వస్తాయి. ప్రజలు జగన్ ని ఆశీర్వదిస్తారు. చంద్రబాబుకు చెవులు వినిపించవు.. కళ్లు కనపడవు. ఎన్నో మీడియాను అడ్డంపెట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు.
జగన్ ఉన్నంతకాలం ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఎన్టీ రామారావు నుంచి దొంగిలించిన టీడీపీ ఇక అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. దానికి కుప్పంలో వచ్చిన ఫలితమే నిదర్శనం. చంద్రబాబు రిటైర్మైంట్ తీసుకొని హైదరాబాద్‌లో కూర్చొని పది మందికి సాయం చేయాలి తప్ప.. టీడీపీని అధికారంలోకి తేవాలని కుట్రపూరిత ఆలోచనలు మానుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దీంతో ప్రజానీకం కూడా ఎన్నికల ఫలితాల ద్వారా సీఎం జగనే మా నాయకుడని తీర్పు ఇచ్చారు.