శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో స్వల్ప భూకంపం!!

ఠాగూర్

బుధవారం, 28 ఆగస్టు 2024 (09:40 IST)
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బుధవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీంతో స్థానికులు భయపడి తమతమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు అందరూ నిద్రిస్తున్న సమయంలో వేకువజామున 3.45 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. భూమి రెండు సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఏం జరిగిందో కాసేపు అర్థంకాక అయోమయానికి గురయ్యారు. భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి మరోలా ఉండేదని వారు వాపోతున్నారు. 
 
సీబీఐ కోర్టులో జగన్‌కు ఊరట.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి 
 
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. ఆయన తన కుమార్తెలను చూసే నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వచ్చే నెల 3వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆయన విదేశాల్లో విహరించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, మొబైల్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుతో సీబీఐకు ఇవ్వాలని కోర్టు షరతు విధించింది. 
 
సుమారుగా 35కి పైగా అక్రమాస్తుల కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్... వచ్చే నెల 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బ్రిటన్‌లో ఉన్న తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకుగాను అనుమతి కోరుతూ 15 రోజుల క్రితం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంలో జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, సీబీఐ కోర్టు జగన్‌‍కు షరతులతో విదేశీ పర్యటనకు అనుమతి ిచ్చింది. యూకే వెళ్ళే ముందు పర్యటనకు సంబంధించింన పూర్తి వివరాలను కోర్టుతో పాటు సీబీఐకు అప్పగించాలని ఆదేశించింది. ఇదే క్రమంలో జగన్‌కు ఐదేళ్ల కాలపరిమితో కొత్త పోర్టు జారీకి కూడా సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు