భూమా నాగిరెడ్డి అరెస్ట్: దురుసుగా, పరుషంగా మాట్లాడటంతో కేసు

శుక్రవారం, 3 జులై 2015 (19:21 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. పోలీసు వాహనంలో నంద్యాల పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నంద్యాలలో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన నాగిరెడ్డి తనయ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను పోలీసులు వెళ్ళిపోవాలని కోరారు. ఆ సందర్భంగా అఖిలప్రియకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న నాగిరెడ్డి అక్కడికి చేరుకుని.. తన కుమార్తెను వెళ్లమని చెప్పడానికి మీరెవరని పోలీసులపై విరుచుకుపడ్డారు. 
 
అఖిలప్రియను వెళ్లమనలేదని.. ఎమ్మెల్యే షెడ్ కిందకు వెళ్లమని చెప్పామని పోలీసులు ఎంత నచ్చజెప్పినా భూమా నాగిరెడ్డి దురుసుగా ప్రవర్తించారని, పరుష పదజాలం ప్రయోగించారంటూ కేసు నమోదైంది. ఇంకా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తమ విధులకు అడ్డుతగిలారంటూ డీఎస్పీ దేవదానం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను టచ్ చేయవద్దంటూ భూమా పొగరుగా వ్యవహరించారని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి