హమ్మ!.. ఆ ఎమ్మెల్యే దేవినేని ఉమని ఎంత మాటనేశాడు?

శనివారం, 9 నవంబరు 2019 (07:28 IST)
మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు సవాల్ విసిరారు.  మైలవరం వ్యవసాయ మార్కెట్ కమిటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ.. నాకు లారీలు గాని ఇసుక వ్యాపారంలో వాటాలు ఉన్నట్లు గాని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. నీకు దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. 
 
"నేను అగర్బశ్రీమంతుడనని ఎప్పుడైనా చెప్పానా? నీలా పిచ్చి పిచ్చిగా వాగే అలవాటు నాకు లేదు. ఈడి కేసులు ముద్దాయిలు అంటూ మతిలేని మాటలు మానుకో. నాకు నీలా పదవులు పిచ్చి లేదు. ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తూ ప్రజల కోసం నీతి నిజాయితీగా పనిచేస్తున్నాను. 
 
నీలా ఇసుక, నీరు- చెట్టు మైనింగ్ మాఫియా లీడర్ గా నేను రాలేదు. మైలవరంలో నీ గ్యాంగ్ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. అందుకే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ బుద్ధి మార్చకో. లేకపోతే నీకు తగిన గుణపాఠం నేను చెబుతాను" అని అన్నారు. 
 
"నీకు బురదగుంటలో పొర్లాడే పందికి పెద్ద తేడా లేదు తెలుసుకో. మతిలేని మాటలు మానుకొకపోతే నేరుగా వచ్చి నీ సంగతి తేల్చుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మైలవరం నియోజకవర్గంలో దోపిడీ లక్ష్యంగా నీవు పని చేశావు. అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తున్నాను. 
 
దేవినేని ఉమా! పిచ్చి వాగుడు మానుకో. లేకపోతే ప్రజా క్షేత్రంలో నీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా" అంటూ సవాల్ విసిరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు