జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డేతో యార్లగడ్డ

శనివారం, 9 నవంబరు 2019 (06:20 IST)
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా అతిత్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షులు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.

శుక్రవారం ఢిల్లీలో జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డేతో భేటీ అయిన యార్లగడ్డ ఆయనకు తెలుగు సాహిత్య చరిత్ర గ్రంధాలను బహూకరించారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో అటు అమరావతి, ఇటు విశాఖపట్నం ప్రాంతాల‌ను సందర్శించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ కాబోయే ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్ధించారు.

అందుకు  జస్టిస్ బాబ్డే  సానుకూలంగా స్పందిస్తూ సమయానుకూలంగా వస్తానని హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు