జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా

మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:59 IST)
ఎమ్మెల్యే ఆర్కే రోజా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి ప్ర‌జ‌ల‌కు క్లారిటీ ఇచ్చారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్నిడిసెంబర్ 21న ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని, దీని ద్వారా 51 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని వివ‌రించారు. వన్ టైం సెటిల్ మెంట్ చేసుకున్నలబ్ధిదారులందరికీ రిజిస్టర్ టైటిల్ అందిస్తార‌ని, వార్డు సచివాయాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తార‌ని చెప్పారు. దీనికి రిజిస్ట్రేషన్ రుసుం, స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జీలు నూరు శాతం మినహాయింపు ఉంటుందని తెలిపారు. 
 
 
హౌసింగ్ కార్పోరేషన్ లో దాదాపు 39 లక్షల మంది డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నారు. వారిలో గ్రామీణ ప్రాంతంలో వారు 34 లక్షల మంది, పట్ణణ ప్రాంతంలో 5లక్షల మంది ఉన్నారు. వారికి ఇళ్లు, స్థలాలు అమ్ముకోవాలన్నాఅమ్ముకోలేని పరిస్థితి. కనీసం రుణాలు తెచ్చుకోలేని పరిస్థితి ఎటువంటి అధికారం లేదు. ఈ  39 లక్షల మంది హౌసింగ్ కార్పోరేషన్ కు దాదాపు రూ.14 వేల కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. 2000 నుంచి 2014 వరకూ వన్ టైం సెటిల్ మెంట్ కింద కేవలం వడ్డీని మాఫీ చేయడం జరిగింది. 
 
 
కానీ సీఎం జగన్ పేదలకు వారి ఇంటిపై పూర్తి హక్కు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నార‌ని ఎమ్మెల్యే రోజా వివ‌రించారు. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయ‌ని, ఇది పూర్తిగా స్వచ్ఛంద పథకం అని పేర్కొన్నారు. దీని వ‌ల్ల ప్రతి లబ్ధిదారునికి రిజిస్ట్రేషన్ కోసం, యూజర్ చార్జీల కోసం అయ్యే సుమారు లక్ష రూపాయలు ఆదా అవుతుంద‌ని చెప్పారు. 
 
 
పట్టా తీసుకున్న వారు, ఇల్లు కట్టుకున్న వారు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌లలో రూ.20వేలు చెల్లిస్తే, ఈ పథకం వర్తిస్తుంద‌ని, లబ్ధిదారులకు ఎంత రుణం ఉన్నా, వన్ టైం సెటిల్ మెంట్ కింద మిగిలిన రుణం ఎంత ఉన్నా మాఫీ అవుతుంద‌న్నారు. వన్ టైం సెటిల్ మెంట్ చేసుకున్న లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ రిటర్న్ చేయడంతో పాటు రిజిస్టర్ టైటిల్ ఇస్తామ‌ని, వాటిని అమ్ముకోవాలన్నా, రుణాలు తెచ్చుకోవాలన్నా లబ్ధిదారులకు పూర్తి హక్కులు వస్తాయ‌న్నారు. బ్యాంకుల్లో మార్ట్‌గేజ్ చేసి, 75 శాతం వరకూ లోన్స్ తీసుకోవచ్చ‌ని, ఇప్పటి వరకు ఈ అవకాశం ఏనాడైనా కలిగిందా అన్న‌ది లబ్ధిదారులు ఆలోచించాల‌న్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు