కోవిడ్ వాక్సిన్ తొలి డోసు చేయించుకున్న ఎమ్మెల్యే ఆర్.కే.కు స్వల్ప అస్వస్థత

మంగళవారం, 16 మార్చి 2021 (09:39 IST)
మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్.కే.)  స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వాక్సిన్ తొలి డోసు చేయించుకున్న విషయం విదితమే.

ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే ఆర్.కే. అదేరోజు అర్థరాత్రి నుంచి 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ తన నివాసంలోనే చికిత్స పొందుతోన్నారు.

మంగళవారం సాయంత్రానికి తాను తిరిగి కోలుకుంటానని,జ్వరం తగ్గగానే  నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు ఎమ్మెల్యే  ఆర్.కే.తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు