రోజా, సెల్వమణికి సన్మానం చేశారు, ఎందుకంటే?

గురువారం, 18 మార్చి 2021 (17:31 IST)
అనుకున్నది సాధించారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. తన సొంత నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలలో ఇబ్బందులు తప్పవని ఆమె భావించారు. తాను నిలబెట్టిన మున్సిపల్ కౌన్సిలర్లను ఎక్కడ రెబల్ అభ్యర్థులు ఓడించేస్తారేమోనన్న భయంలో ఉన్నారు రోజా. 
 
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్షానికి ఊపిరి పీల్చుకోనివ్వకుండా భారీ మెజారిటీతో అభ్యర్థులను గెలిపించుకోవడం.. అందులోను రెబల్స్‌ను చిత్తు చేశారు రోజా. ఒకే ఒక్క రెబల్ అభ్యర్థి నగరిలో గెలుపొందాడు.
 
అంతేతప్ప రెండు మున్సిపాలిటీలను వైసిపినే కైవసం చేసుకుంది. దగ్గరుండి కొత్త కౌన్సిలర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు రోజా. ఎంతో సంతోషంతో కార్యకర్తలందరినీ పలుకరిస్తూ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజా. ఈ సంధర్భంగా రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణిని ఘనంగా సన్మానించారు వైసిపి కార్యకర్తలు, నాయకులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు