చంద్రబాబు ఎక్స్‌పైర్ అయిపోయిన అలాంటివారు... రోజా కామెంట్స్

బుధవారం, 30 జనవరి 2019 (19:33 IST)
ఎపి సిఎం చంద్రబాబునాయుడిపై మరోసారి ఫైరయ్యారు  రోజా. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెర్వులో నిర్వహించిన వైసీపీ మహిళా స్వరం సభలో రోజా పాల్గొన్నారు. మహిళలకు ఏదో చేసేస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారని, అయితే ఆయన చేసింది శూన్యమంటూ విమర్శించారు.
 
ఎపిలో ఉద్యోగం వచ్చింది నారా లోకేష్‌కు మాత్రమేనని, అంతేకాకుండా పారిశ్రామిక వేత్త అయ్యింది నారా బ్రహ్మిణి మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుని ప్రజలు ఇక నమ్మరని, రాజన్న రాజ్యం రావడం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఎక్స్‌పైర్ అయిన టాబ్‌లెట్ అంటూ ఎద్దేవా చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు