మల్టీస్టారర్ చిత్రాలలో ఎక్కువ విజయాలను అందుకున్న హీరోలలో వెంకటేష్ ముందుంటారు. కామెడీ చిత్రాలలో కూడా మంచి పేరు తెచ్చుకున్న టాప్ హీరో మన వెంకీ. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, నమో వెంటకటేశ వంటి చిత్రాలలో కామెడీ బాగా పండించి మంచి హిట్‌లను ఖాతాలో వేసుకోవడమే కాకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
తర్వాత తనతో సన్నిహితంగా మెలిగిన ప్రముఖుల ఫోటోలు, మెసేజ్‌లను లీక్ చేయడం, పవన్ కళ్యాణ్‌తో వివాదం మొదలైన అంశాల ద్వారా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఎఫ్2 విజయం నేపథ్యంలో వెంకీపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
"చినమామ అదే మా వెంకీ మామ ఎఫ్2 మూవీ పెద్ద హిట్ అంటగా. కంగ్రాచ్యులేషన్స్ మామ. నా 90 డిగ్రీస్ డైలాగ్ కూడా వాడారంటగా" అని వ్యాఖ్యలు చేయడంతో పాటుగా శ్రీరెడ్డి ఈస్ బ్యాక్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించింది. దీనిపై వెంకీ ఫ్యాన్స్ కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీతో శ్రీరెడ్డికి ఉన్న వివాదం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.