ఏపీ మంత్రి నారా లోకేష్ తనను తాను ఒక ఆదర్శవంతమైన కొడుకుగా, ప్రజా ప్రతినిధిగా నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన తన కుమారుడి పారెంట్స్ మీటింగ్‌కు హాజరయ్యారు. మంత్రిగా ఇతరత్రా పనుల్లో నిమగ్నమైన నారా లోకేష్.. తన బిజీ షెడ్యూల్ నుండి సమయం కేటాయించి తన కుమారుడు దేవాన్ష్ కోసం పేరెంట్-టీచర్ మీటింగ్‌కు హాజరయ్యారు. లోకేష్, తన భార్య బ్రాహ్మణి, దేవాన్ష్ కలిసి సెల్ఫీ క్యాప్చర్ చేశారు. ఈ ఫోటోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.