న్యాయ వ్యవస్థ నిద్ర పోతుందా?: మోదుగుల సంచలన వ్యాఖ్యలు

గురువారం, 3 మార్చి 2022 (18:45 IST)
ఏపీ మూడు రాజధానులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టులు ప్రజలకు అవసరమైన అంశాలను టేబుల్ మీదకు తీసుకోవడం లేదన్నారు. కేవలం తమకు అవసరమైన అంశాలనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందంటూ వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థలలో ఎవరు గొప్పా అని ఆయన అడిగారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని.. న్యాయ వ్యవస్థ నిద్ర పోతుందా అంటూ మోదుగుల ఘాటు వ్యాఖ్యలు చేశారు.  
 
రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దేశ ప్రజలకు తెలుసునని.. కాంగ్రెస్ పార్టీ రాష్టాన్ని నాశనం చేసిందని, అందులో బిజేపి పాత్ర కూడా ఉందని మోదుగల ఆరోపించారు. రాష్ట్ర విభజనపై వేసిన పిటిషన్‌లపై ఎందుకు వాదనలు జరగడం లేదని మోదుగుల ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాలు చెల్లవని కోర్టులు చెప్పడం ఏంటీ అని ఆయన నిలదీశారు. 
 
మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని.. ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కోర్టు‌లో పిటిషన్ వేశామని మోదుగుల గుర్తు చేశారు. 2019లో వేసిన పిటిషన్‌ను కోర్టు ఎందుకు పట్టించుకోవడం లేదని వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ముందు రాష్ట్ర విభజన పిటిషన్‌లపై తీర్పులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు