ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే వైకాపా ఔట్... ఇండియా టు డే - సీ ఓటర్ సర్వే

శనివారం, 26 ఆగస్టు 2023 (08:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీల బలం నానాటికీ పెరిగిపోతుంది. దీంతో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా, వచ్చే యేడాది ఏపీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగన్నాయి. అయితే, ఇప్పటికిపుడు ఏపీలో ఎన్నికలంటూ జరిగితే అధికార వైకాపా చిత్తుగా ఓడిపోతుందని ప్రముఖ పత్రిక ఇండియా టుడే - సీ ఓటర్ సంస్థ నిర్వహించే సర్వేలో వెల్లడైంది. అధికార వైకాపా కేపలం 3 లేదా 4 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని, టీడీపీ 15 నుంచి 20 సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైకాపా 22 స్థానాలను దక్కించుకోగా, టీడీపీ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే, వచ్చే ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇపుడున్న పరిస్థితుల్లో టీడీపీకి ఏకంగా 15 సీట్లు, వైసీపీ 3-4 స్థానాలకే పరిమితమయ్యే అవకాశముందని ఈ సర్వేలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. 
 
మిగిలిన స్థానాల్లో హోరాహోరీ లేదా జనసేన - టీడీపీ పొత్తును బట్టి ఫలితాలు ఉంటాయని భావించవచ్చు. గురువారం రాత్రి పొద్దుపోయాక 'ఇండియా టుడే' ఇంగ్లీష్ న్యూస్ చానల్. 'సీ ఓటర్‌తో కలిసి 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో చేసిన సర్వే ఫలితాలను వెల్లడించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత చరిష్మాతో మోడీ పెద్ద ఇబ్బందులు లేకుండా మూడోసారి అధికారంలోకి వచ్చేస్తారని తెలిపింది. 28 పార్టీల ప్రతిపక్ష కూటమి అయిన ఇండియా సంఖ్యాబలం 200 సీట్లకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు