తల్లీకూతురు ఒకే యువకుడిని ఇష్టపడ్డారు.. శారీరకంగా కలిశారు.. చివరకు ఏమైంది?

సోమవారం, 15 జులై 2019 (16:32 IST)
అది హైదరాబాద్ లోని అమీర్ పేట ఏరియా. గుంటూరుకు చెందిన పరమేష్ ఉద్యోగం కోసం అమీర్ పేటకు వచ్చి గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇంటి ఓనర్ సునయన భర్త నాలుగు సంవత్సరాల క్రితమే కాలం చేశారు. సునయకు ఇంటర్ చదివే ఒక కుమార్తె కూడా ఉంది.
 
ఉద్యోగం కోసం వారంరోజుల పాటు ప్రయత్నించాడు పరమేష్. గత మూడు నెలల క్రితం ఉద్యోగం కోసం ప్రయత్నించి మధ్యాహ్నం వేళ ఇంటికొచ్చాడు. అప్పటికే సునయన ఇంటి బయట నిలబడి ఉంది. ఏంటి పరమేష్... ఉద్యోగం ఎంతవరకు వచ్చిందని అడిగింది. ఉద్యోగం కోసమే ట్రై చేస్తున్నానని చెప్పాడు. 
 
రా ఇంటికి రా... నీళ్ళు తాగి వెళుదువు అంటూ పిలిచింది సునయన. పరమేష్ లోపలికి వెళ్ళాడు. నీళ్ళు తాగాడు. ఆమె కుటుంబ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. తన భర్త చనిపోయాడని బోరున ఏడుస్తూ పరమేష్ పైన వాలిపోయింది సునయన. దీంతో పరమేష్‌కు ఏమీ అర్థం కాలేదు.
 
మొదట్లో సునయనను వారించే ప్రయత్నం చేసినా ఆ తరువాత మాత్రం క్రమంగా ఆమెకి దగ్గరై ఆమెతో కలిసి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇలా మూడు నెలల పాటు సాగింది. వారం రోజుల క్రితం సునయన కుమార్తె ప్రియకు జ్వరమొచ్చింది. అందులోను ప్రియకు పరీక్షలు జరుగుతున్నాయి. జ్వరంలో బస్సు ఎక్కి కళాశాలకు వెళ్ళడం కష్టమని సునయన పరమేష్‌ను డ్రాప్ చేయమని కోరింది. 
 
తన బైక్ పైన డ్రాప్ చేశాడు పరమేష్. ఇలా ఒకరోజు డ్రాప్ చేయడం కాస్త ప్రతిరోజుగా మారిపోయింది. అంతేకాదు ప్రియను కళాశాలలో వదలడంతో పాటు ఆమెకు చదువులో ఉన్న డౌట్లను చెప్పేవాడు పరమేష్. దీంతో పరమేష్ ప్రేమలో పడిపోయింది ప్రియ. అంతేకాదు అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. తల్లీ, కూతుళ్ళు ఇద్దరూ ఒకరితోనే శారీరక సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. రెండు రోజుల క్రితం కళాశాలకు వెళ్ళిన ప్రియ జ్వరం ఎక్కువగా ఉందని మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసింది.
 
ఆ సమయంలో సునయతో కలిసి ఉన్నాడు పరమేష్. దీంతో ప్రియకు కోపం కట్టలు తెంచుకుంది. ఎందుకిలా చేశావంటూ తల్లిని ప్రశ్నించింది. నేను పరమేష్‌ను ప్రేమిస్తున్నానంటూ తల్లికే చెప్పేసింది ప్రియ. దీంతో సునయనకు కోపమొచ్చింది. తన సుఖానికి కుమార్తె అడ్డొస్తోందని భావించిన తల్లి కుమార్తె ప్రియను చంపేందుకు ప్లాన్ చేసింది. పరమేష్‌తో కలిసి నిద్రిస్తున్న ప్రియను హత్య చేశారు. ముందుగా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కానీ చివరకు పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడటంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు