కొవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొవిడ్ ఆస్పత్రులు, కేర్ సెంటర్లు, పడకలు, అంబులెన్స్‌ల వివరాల కోసం ఈ కాల్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో కాల్‌సెంటర్ల పనితీరు ఆశించినంత మెరుగ్గా ఉండటంలేదు.